నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ పూర్తి చేసి..ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి టీఎస్ ఆర్టీసీ ఉద్యోగం కల్పిస్తోంది.మొత్తం 150పోస్టులకు దరఖాస్తులను అధికారికంగా ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగంలో చేరేవారికి మంచి అనుభవంతోపాటు కెరీర్ కూడా ఏర్పడుతుంది. ఈ ఉద్యోగాలను ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఈో లో డిగ్రీపూర్తి చేసి ఉండాలి. ఈ డిగ్రీ 2018 నుంచి 2024లో పూర్తి చేయాలి. స్థానిక అభ్యర్థులకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా బీబీఏ గ్రాడ్యుయేట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 150 అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ లో 26 ఉన్నాయి. అభ్యర్థులను వారి విద్యార్హతలను బట్టి ఎంపిక చేస్తారు. ఈ అప్రెంటిస్ షిప్ కార్యక్రమం మూడేళ్లు ఉంటుంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ. 15వేల స్టైఫెండ్ ఇస్తారు. రెండో ఏడాది రూ. 16వేలు, మూడో ఏడాది నెలకు రూ. 17వేల చొప్పున ఇస్తారు. (https://nats.education.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఇస్రోలో భారీగా ఉద్యోగాలు..దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?
The post టీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు..ఇంటర్వ్యూ లేకుండానే పోస్టింగ్..అప్లయ్ చేసుకోండిలా..!! appeared first on tnewstelugu.com.
