యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతున్నది.భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండక్రింద విష్ణుపుష్కరణి,కారు పార్కింగ్,బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది.
The post యాదగిరిగుట్టకి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్..! appeared first on tnewstelugu.com.
