కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో సరదాగా స్నానం చేద్దామని దిగి మృత్యువాత పడ్డారు. కాగా.. చనిపోయిన వారిని విజయవాడలోని పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్గా గుర్తించారు. వీరితో స్నానానికి వెళ్లిన మరో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. స్నానానికి వెళ్లకుండా నది ఒడ్డుపై ఉన్న షేక్ షారుక్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కాగా.. నదిలో మునిగి చనిపోయిన ముగ్గురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులందరూ పడమట హైస్కూల్ రోడ్డులోని నారాయణ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు.. విచారణ చేపట్టారు.
Read Also: రికార్డుల సీఎం.. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్
The post కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి appeared first on tnewstelugu.com.
