సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబ్ బెదిరింపు వచ్చింది. ఆల్ఫా హోటల్లో బాంబులు పెట్టే విషయమై కొంతమంది చర్చిస్తున్నారని.. ఆ వ్యక్తులను చూపిస్తానంటూ గౌస్ పాషా అనే వ్యక్తి 100కు కాల్ చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకొని, గౌస్ పాషాకు ఫోన్ చేయగా అతని ఫోన్ కలవలేదు. దాంతో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో ఆల్ఫా హోటల్ మొత్తం తనిఖీలు చేశారు. చివరికి హోటల్లో బాంబు లేదని తేల్చిన పోలీసులు.. ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. ఫోన్ చేసిన గౌస్ పాషాను ఫోన్ కాల్ ఆధారంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Also: విద్యార్థులకు షాకిచ్చిన కెనడా.. ఇకపై స్పాన్సర్షిప్ కష్టమే
The post సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌కు బాంబ్ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు.. appeared first on tnewstelugu.com.
