బ్రెజిల్లో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన మినాస్ గైరోస్ లో జరిగింది. సావోపాల్ లోని కంపినాస్ నగరం నుంచి బయలుదేరిన విమానం సింగిల్ ఇంజిన్ నడుస్తుంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మైనింగ్ నగరంగా పేరొందిన ఇటాపెవా పరిధిలో పేలిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మరణించారని తెలిపారు. మొదట మూడు శవాలను వెలికి తీశామని..మిగతా నాలుగు పక్కనే ఉన్న చెట్లపై, గడ్డిపై పడిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు …ముగ్గురు కార్మికులు దుర్మరణం.!!
