మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి నర్సా రెడ్డి సోమవారం సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో మరణించిన ఆయన వయసు 92. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్‌రావు హయాంలో రెడ్డి మంత్రిగా ఉన్నారు. 1967లో నిర్మల్ ఎమ్మెల్యేగా, 1989లో ఆదిలాబాద్ ఎంపీగా ఎన్నికైన ఈయన స్వాతంత్య్ర సమరయోధుడిగా, జిల్లాలో పలుకుబడి కలిగిన నాయకుడిగా వెలుగొందారు.
ఇక సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని.. ఆయన అనుభవాలు మాకు మార్గదర్శకంగా ఉండేవి, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు సీఎం రేవంత్.
The post మాజీ పీసీసీ అధ్యక్షుడు కన్నుమూత..! appeared first on tnewstelugu.com.
