టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే అతికొద్దిమంది నటుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అయితే అలాంటి హీరోకి షాక్ ఇచ్చింది నాంపెల్లి కోర్టు. వెంకటేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు సురేష్‌బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేశారు. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ యజమాని కె. నందకుమార్ దాఖలు చేసిన పిటీషన్ మేరకు వెంకటేష్, అతని కుటుంబంపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
వెంకటేష్‌కు చెందిన స్థలంలో భవనాన్ని కూల్చివేయడంపై కేసు నమోదైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక తాజాగా విడుదలైన వెంకటేష్ చిత్రం సైంధవ్ భారీ డిజాస్టర్‌గా అయింది. ప్రస్తుతం వెంకీ రానా నాయుడు రెండవ సీజన్ కోసం సిద్ధమవుతుండగా.. తన తదుపరి తెలుగు చిత్రాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
