భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై మంత్రి కోమటిరెడ్డి ఇవాళ(సోమవారం) జరిగిన సమావేశంలో దుర్మార్గంగా వ్యవహరించిన తీరు పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై అధికారం, అహంకారంతో కోమటిరెడ్డి జడ్పీ చైర్మన్ వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి పైన నోరు పారేసుకుంటున్నారన్నారు. మొన్నటికి మొన్న రైతుబంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టమని తన అహంకారాన్ని బయట పెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి..ఇవాళ జిల్లా జడ్పీ చైర్మన్ పై అదే నోటి దురుసు చూపించారన్నారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పని చేస్తుందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: కోమటి రెడ్డికి అంత అహంకారం పనికి రాదు
