ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఝాన్సీ పై అనుచితంగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్ పై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెన్షన్ వేటు వేశారు. జయశంకర్ విశ్వవిద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకురాలి పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) స్పందించింది. ఘటనపై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీకి చెందిన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 25న విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు ఏబీవీపీ నాయకులు వర్సిటీ దగ్గరకు వెళ్లారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనంపై వెళ్తూ ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ జుట్టు పట్టుకోవడంతో కింద పడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో చర్యలు చేపట్టిన సీపీ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
The post విద్యార్ధినిపై అనుచితంగా వ్యవరించిన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ appeared first on tnewstelugu.com.
