సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించారు. రెండు ఫేస్‌బుక్ అకౌంట్లు క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బులు వసూలు చేయడమే కాకుండా అనుచిత మెసేజ్ లు పంపుతున్నారు. గుర్తించిన హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ఖాతాలపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్‌ల ఆదారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీవని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేయాలని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డులపై సీఎం కీలక ఆదేశాలు!
