ఢిల్లీలో దారుణం జరిగింది. అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జనవరి 17వ తేదీన ఢిల్లీలో జరిగింది. ఈ ఘటన గురించి జనవరి 19న వెలుగులోకి వచ్చింది. తలపై బండరాయి మోదడంతో యువకుడు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
జనవరి 19వ తేదీన ఢిల్లీలోని మోరీ గేటుకు సమీపంలోని డీడీఏ పార్కు దగ్గర గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మ్రుతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో శవాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో స్థానికంగా ఉన్న 50 సీసీ టీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. మ్రుతుడు యూపీలోని జలాన్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ గా గుర్తించారు. కోయా మండిలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. నైట్ షెల్టర్ లో ఉంటున్నాడు. ఫుటేజీలో ప్రమోద్ తోపాటు రాజేశ్ అనే వ్యక్తి చివరిసారిగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ప్రమోద్ తనను అసహజ శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి చేసేవాడని నిందితుడు చెప్పాడు. దీంతో అతడిని హత్య చేశానని రాజేశ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీల పేరుతో నయా మోసం..రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్స్.. !!
