అమాయకులే లక్ష్యంగా మోసం చేసేందుకు కేటుగాళ్ల కొత్త కొత్త ప్లాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే రోజుకో నయం మోసంతో ఏది నిజమో…ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి నెలకొంది . నిజంగా మోసగాళ్లు రోజుకో రూపం..పూటకో వేశంతో అమాయకులను టార్గెట్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. మాయ మాటలతో నమ్మబలికి నిలువునా ముంచేస్తున్నారు. ఉన్నత చదువులు చదివినవారికి కూడా ఉపాధిపేరుతో రంగంలోకి దింపి…వారిని మోసం చేస్తున్నారు. ఉన్నందంతా ఊడిన తర్వాత మోసపోయామంటూ లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు బాధితులు.
తాజాగా ఓ కొత్త రకం మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. బ్రాండెండ్ బ్యూటీ పార్లర్ ప్రాంచైజీలు అంటూ హైదరాబాద్ నగరంలో నయా మోసానికి రెడీ అయ్యారు. వందమందికి పైగా అమయాకులను మోసం చేస్తూ ఏకంగా రూ. 3కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బుతో ఊడాయించారు కిలాడీ కపుల్స్. చివరకు తాము మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…హైదరాబాద్ లోని ప్రగతి నగర్ హెడ్ ఆఫీస్ కు సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జన్సికలు కలిసి ఓ ఫేక్ బ్యాటీ పార్లర్ రన్ చేస్తున్నారు. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో ప్రచారం చేశారు. తన ఫ్రాంచైజీని తీసుకుంటే నెలకు 35వేల జీతం ఇస్తామంటూ నమ్మబలికారు. ఆ ప్రకటన చూసి నమ్మి కొంతమంది వీరిని ఆశ్రయించారు. అలా వారిని నమ్మనివారిని మాటలతో బురిడీ కొట్టింది. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడిపెడితే కొద్దీ కాలంలోనే తమ పెట్టుబడి రెండింతలు అవుతుందని నమ్మించారు. అలా వారి మాటలు నమ్మి రూ. 3లక్షల వరకు సూలు చేశారు. వందకు పైగా పార్లర్ ఓపెన్ చేశారు. తొలి రెండు మూడు నెలలు పెట్టుబడిపెట్టినవారికి చెప్పినట్లుగానే జీతం ఇచ్చారు. వారు అనుకున్న టార్గెట్ కు రీచ్ అవ్వగానే ఉడాయించారు.
ఎన్నిసార్లు ఫోన్ చేసిన వారు ఎత్తకపోవడంతో కొంతమంది ఆఫీసుకు వచ్చారు. ఆఫీసు కొన్నిరోజులుగా తెరవడం లేదని తెలుసుకుని మోసపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలకు చెందిన బాదితులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ బోర్డులో ఆంధ్రుడు ..ఎవరి హస్తం ఉందంటూ చర్చ..!!
The post బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీల పేరుతో నయా మోసం..రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్స్.. !! appeared first on tnewstelugu.com.
