Bhatti Vikramarka | వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.
హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖ(Health department)లో త్వరలో మరో 5 వేల ఉద్యోగాలు(Five thousand Jobs) భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా బుధవారం స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఒకేసారి 7,094 మంది స్టాఫ్ నర్సులకు(Nursing officers) నియామక పత్రాలు అందించామన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం యువత పోరాడింది. నిరుద్యోగ యువత కోరుకున్నట్లే ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
