బడ్జెట్ కు ముందే ప్రజలకు షాకిచ్చింది కేంద్రం. LPG సిలిండర్ ధరలు దేశంలోని అన్ని నగరాల్లో పెరిగాయి. వాణిజ్య సిలిండర్ల ధరలు చమురు కంపెనీలు పెంచాయి. అయితే గృహ సిలిండర్ల రేట్లు ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. అందులో ఎలాంటి మార్పు లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.14 పెంచాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఇది కూడా చదవండి: విషాదం..పోలీస్ జాబ్ రాలేదని యువకుడి సూసైడ్..!!
