హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో విషాదం నెలకొంది. పోలీసు ఉద్యోగం రాలేదన్న మనస్తాపతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానిక నీరుకుళ్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి సారంగంకు ముగ్గురు కుమారులు. ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్నకొడుకు శ్రీకాంత్ డిగ్రీ పూర్తి చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. మొదటిసారిఫైనల్ పరీక్షల్లో విఫలమయ్యాడు. రెండోసారి ఫైనల్ పరీక్ష రాయగా ఒక్క మార్కుతో ఉద్యోగం చేజారిపోయింది. వయోపరిమితి ద్రుష్ట్యా మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉండదని భావించిన శ్రీకాంత్ తీవ్ర మనస్తాపం చెందాడు. జనవరి 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు. శ్రీకాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: నేడు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!!
The post విషాదం..పోలీస్ జాబ్ రాలేదని యువకుడి సూసైడ్..!! appeared first on tnewstelugu.com.
