బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్ధానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం…ఆపరేషన్ జరగడం వల్ల కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంలో జాప్యం జరిగింది. గురువారం మధ్యాహ్నం 12గంటలకు అసెంబ్లీకి చేరుకుని 12.45గంటలకు శాసన సభాపతి కార్యాలయలో ప్రమాణస్వీకారం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తర్వాత బీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్బంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు.బడ్జెట్ ప్రసంగం లైవ్ లింక్ ఇదే..!!
