కేసీఆర్ పాలనలో లోపాలు వెతకడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచించారు. ఈ రోజు కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు.
Read Also: పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టిస్కు పాల్పడితే 10 ఏండ్ల జైలు, రూ. కోటి జరిమానా
‘ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. ఇక కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతున్నారు. ఉద్యోగాలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు ఫిబ్రవరి 1.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి.. ఏమైంది రేవంత్ రెడ్డి? ఏమైనా మతిమరుపు వచ్చిందా? చేస్తా అన్నది చేయడం లేదు. మేం చేసినవి రేవంత్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. హరీష్ రావుకు నీకు పోలికా? హరీష్ రావు ఉదయం 6 గంటల నుంచి పని మొదలు పెట్టి రాత్రి 2 గంటల వరకు ప్రజల కోసమే పని చేస్తాడు. హరీష్ రావు శ్రమ వల్లే నిన్న రేవంత్ ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలు సాకారం అయ్యాయి. కేసీఆర్ హయాంలో ఏం జరగలేదంటే నిన్నటి కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేవారా? తిట్లు తిట్టడం కాదు.. మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు రేవంత్. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైనా ఒక్క ఉద్యోగం ఇచ్చి ఉంటె నా ముక్కు నెలకు రాస్తా. కేసీఆర్ హాయాంలో జరిగిన ఉద్యోగ నియామక వివరాలు ఇపుడు వెల్లడిస్తున్నా.. కాదని రేవంత్ చెప్పగలరా? కొత్త ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక.. రేవంత్ పనికి రాని విషయాలు మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు రేవంత్ అబద్ధాల్లో బతుకుతాడు. బిల్లా-రంగాలకు ప్రతి రూపం రేవంత్ రెడ్డి. అందుకే ప్రతి రోజూ వాళ్ళ పేర్లు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. కేసీఆర్ను బొంద పెడతా అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా? రేవంత్ సీఎంలా వ్యవహరించాలి.. రౌడీలా కాదు. కేసీఆర్ పాలనలో లోపాలు వెతకడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చేయి రేవంత్ రెడ్డి. ఎవ్వరూ 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టోద్దు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ ఇక నీ ఆటలు సాగవు’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.
