జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరద ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీలో రూ.6.40 కోట్లతో చేపట్టనున్న నాలాల అభివృద్ధికి ఆమె శంకుస్థాపన చేశారు. ఎస్‌ఎన్‌డీపీ నిధుల నుంచి ప్రత్యేక నాలాల ఏర్పాటుకు మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కోట్ల రూపాయలను ఇందుకు కెటాయించారని తెలిపారు. దీంతో మున్సిపాలిటీలో వరద ముంపు శాశ్వతంగా పోతుందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్లు, అధికారులను సబిత ఆదేశించారు. ఈ సందర్భంగా తనకు గెలుపు అందించిన కాలనీవాసులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాదీ, వైస్ చైర్మన్ పర్హానాజ్, మున్సిపల్ కమిషనర్ వసంత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Also Read.. ఫ్లిప్‌కార్ట్‌లో సరి కొత్త ప్రయోగం.. 20 నగరాల్లో అమలు..!!
