హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా తన ఆటోను ప్రజాభవన్ ముందు తగులబెట్టాడు ఓ డ్రైవర్. ఆర్టీసీ బస్సు లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ ల పరిస్థితి రోడ్డున పడిందని, ఆర్ధిక ఇబ్బదులతో మనస్థాపంతోనే ఈ పని చేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపాడు డ్రైవర్. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కు చెందిన దేవ్లా నాయక్ (45) పది సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి ఆటో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం మియాపూర్ లో భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడుతో కలిసి నివసిస్తున్నాడు.
Also Read.. మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతిలో పెట్టడమా?
గతంలో ఆటో నడపడం వల్ల రోజుకు రెండు నుండి మూడు వేల రూపాయల ఆదాయం వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రస్తుతం రోజంతా ఆటో నడపటం వల్ల కనీసం ఐదు వందల రూపాయలు కూడా రావడం లేదు అని మనస్థాపానికి గురయ్యాడు. రేవంత్ సర్కార్ తమ గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని బేగంపేటలోని ప్రజా భవన్ సమీపంలో తన ఆటోకి నిప్పు పెట్టి నిసరన వ్యక్తం చేశాడు. పోలీసులు దేవ్లా నాయక్ ని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read.. ఈనెల 8న ప్రభుత్వ, విద్యా సంస్థలకు సెలవు
