రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో గురువారం తెల్లవారుజామున విషాదం నెలకొంది.అమ్మకావాలంటూ నిద్రలో నుంచి లేచి బయటకు వచ్చి బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికిచెందిన కోళ్ల సూర్యకుమార్ యాదమ్మ దంపతులు కూలి పనుల కోసం శంషాబాద్ కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెల ఏడాది వయస్సున్న కొడుకుతో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ గర్భిణీ.
ప్రసవం కోసం ఆసుపత్రిలో చేర్చారు. బుధవారం రాత్రిచిన్నారి పాల కోసం ఏడవగా తండ్రి తాగించి పడుకోపెట్టాడు. తెల్లవారుజామున మరోసారి లేచి ఏడుస్తూ బయటకు వచ్చాడు. దీంతో వీధి కుక్కలు మూకుమ్మడిగా బాలుడిపై దాడి చేశాయి. వాహనదారులు వాటిని తరిమివేసి పరిశీలించగా బాలుడు అప్పటికే మరణించాడు. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు కాగా ఒకరు అనారోగ్యంతో మరణించాడు. మరొకరు పుట్టిన 7రోజులకు…ప్రస్తుతం ఈ బాలుడు కుక్కల దాడిలో మరణించడంతో కన్నీంటిపర్యంతమవుతున్నారు.
ఇది కూడా చదవండి: జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం..!!
