ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల పెరుగుదలపై డబ్ల్యూహెచ్ ఓ కు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య 2050లో 35 మిలియన్లకు పైగా పెరుగుతుందని 2022లో ఉన్న సంఖ్య కంటే 77 శాతం ఎక్కువ అని గురువారం హెచ్చరించింది. పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం వాయు కాలుష్యాన్ని ప్రధాన కారకాలుగా పేర్కొంది.2050లో 35 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని అంచనా వేసింది. 2022లో నిర్ధారణ అయిన 20 మిలియన్ కేసుల నుండి 77 శాతం కొత్త కేసులు నమోదు అవుతాయని తెలిపింది.
వేగంగా పెరుగుతున్న గ్లోబల్ క్యాన్సర్ భారం జనాభా వృద్ధాప్యం, పెరుగుదల రెండింటినీ ప్రతిబింబిస్తుందని తెలింది. అలాగే ప్రమాద కారకాలకు ప్రజల బహిర్గతానికి సంబంధించిన మార్పులను ప్రతిబింబిస్తుందని.. వీటిలో చాలా సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించినవి ఉన్నాయని పేర్కొంది. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు 2022 అంచనాలతో పోల్చితే 2050లో అదనంగా 4.8 మిలియన్ కొత్త కేసులు నమోదవుతాయని, కేసుల సంఖ్యలో అత్యధిక పెరుగుదల నమోదు అవుతుందని WHO తెలిపింది.
ఇది కూడా చదవండి: పురుషులకు స్పెషల్ బస్సు..మూడురోజుల ముచ్చటే..!
