రాజకీయంగా అపరిపక్వత, అనుభవం లేని రేవంత్ రెడ్డితో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఎన్ లక్ష్మీ పార్వతి గురువారం హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. మునుముందు కష్టాలు మరిన్ని తప్పవన్నారు. గురువారం ఆమె సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని, న్యూఢిల్లీలోని పార్టీ హైకమాండ్‌పై ఆధారపడాల్సి ఉంటుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆమె కొనియాడారు. రైతులకు పెట్టుబడి సాయం సహా కేసీఆర్ ప్రభుత్వ విధానాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆమె అన్నారు.
The post రేవంత్ రెడ్డికి పరిపక్వత లేదు.. తెలంగాణకి కష్టాలు తప్పవు appeared first on tnewstelugu.com.
