ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడానికి వెళ్లిన అధికారుల మీద స్థానికులు దాడిచేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పటేల్ గూడలో ఎటువంటి అనుమతులు కొంతమంది ఇండ్లు నిర్మించారు. విషయం దృష్టికి రావడంతో అధికారులు వెళ్లి ఇళ్ల కూల్చివేత మొదలుపెట్టారు. అయితే ఆ ఇండ్ల యజమానులు స్థానికులతో కలిసి అధికారులపై రాళ్లదాడికి యత్నించారు.
Read Also: రూ. 29లకే కేజీ బియ్యం.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా లభ్యం
ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పోలీసుల భద్రత తీసుకుని ఓ వెంచర్లో అక్రమంగా నిర్మించిన ఆరు ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. ఈ ఇండ్ల గురించి ఐదు రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరినా వెంచర్ యజమానులు స్పందించలేదు. దాంతో అధికారులు కూల్చివేతలకు దిగారు.
