Tiger | యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri )జిల్లా రామన్నపేట పట్టణ(Ramannapeta) కేంద్రంలో పులి(Tiger )సంచారం కలకలం సృష్టిస్తున్నది.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి( Yadadri Bhuvanagiri )జిల్లా రామన్నపేట పట్టణ(Ramannapeta) కేంద్రంలో పులి(Tiger )సంచారం కలకలం సృష్టిస్తున్నది. రామన్నపేట పట్టణ కేంద్రంలోని మైలురాయి 45 వద్ద పులి రైలు పట్టాలు దాటుండగా రైల్వే గార్డు గమనించి స్థానిక రైల్వే స్టేషన్లో సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అటవీ అధికారులు కూడా సమాచారం అందించారు. పులి సంచరిస్తున్నదనే సమాచారంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.
