బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలన్నారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.దీనికి సంబంధించి అధికారులను ఆదేశించారు. ఇవాళ( శుక్రవారం) నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల అమలులో ఆలస్యాన్నిఎట్టి పరిస్థితులలో సహించబోనని స్పష్టం చేశారు. ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసుకున్న పనులన్నింటినీ పూర్తి చేయాల్సిందేనని సూచించారు. రోడ్లు, నాలాల విస్తరణ, పార్కుల సుందరీకరణ , డ్రైనేజీల నిర్మాణాలతో సహా ఇతర మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయాలన్నారు ఎమ్మెల్యే గాంధీ.
ఇది కూడా చదవండి: పార్సిళ్ల పేరుతో మోసాలు.. జాగ్రత్త
The post బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలి appeared first on tnewstelugu.com.
