సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దీనికి సంబంధించి ఇవాళ( శుక్రవారం) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పార్సిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. దర్యాప్తు సంస్థల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త దందాకు తెరలేపారని… మీ పేరుతో ఫెడెక్స్‌లో డ్రగ్స్ పార్సిల్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నారని హెచ్చరించారు.
నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు ఎండీ సజ్జనార్. భయపడినవారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పార్శిల్ అనగానే భయపడిపోయి అడిగినంత డబ్బులు ఇవ్వొద్దని సూచించారు.
ఇది కూడా చదవండి: జీవో 55ను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం
