Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ప్రాపర్టీ షో అదుర్స్..-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 2, 2024No Comments

‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర మేయర్‌ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా సందర్శకులతో హరిత హోటల్‌ కిటకిటలాడింది.

February 3, 2024 / 04:00 AM IST
ప్రాపర్టీ షో అదుర్స్..
  • వివిధ వర్గాల నుంచి విశేష స్పందన
  • సందర్శకులతో కిటకిటలాడిన హరిత హోటల్‌
  • ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహణ
  • తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజలు
  • పాల్గొన్న ప్రముఖ రియల్‌ సంస్థలు, బ్యాంకర్లు
  • నేడు కూడా కొనసాగనున్న కార్యక్రమం
  • అత్యంత అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరం
  • నగర మేయర్‌ గుండు సుధారాణి

‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నగర మేయర్‌ గుండు సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించగా సందర్శకులతో హరిత హోటల్‌ కిటకిటలాడింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో సొంతింటి కల సాకారం చేసుకునే వారి సౌలభ్యం కోసం ఒకేచోటకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బ్యాంకులను తీసుకురావడంతో వివిధ వర్గాల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. శనివారం కూడా ప్రాపర్టీ షో కొనసాగనుండగా పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఏర్పాటుచేసిన స్టాళ్లలో వెంచర్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, విల్లాలు, బ్యాంకు రుణాల గురించి తెలుసుకోవచ్చు. సొంతిల్లు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు కొనాలనుకునే వారికి ఈ వేదిక ఉపయోగపడనుంది.

– హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 2

01

ఇదొక చక్కని వేదిక: మేయర్‌ సుధారాణి

హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్‌ అని నగర మేయర్‌ గుండు సుధారాణి అన్నారు. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఈ ప్రాపర్టీ షో ప్రజలకు వేదికగా నిలిచిందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వెంచర్లు, ఇళ్లు, బ్యాంకు రుణాల గురించి తెలుసుకునేందుకు ప్రజలకు ‘నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మంచి అవకాశాన్ని కల్పించిందన్నారు. దేశంలోనే వైవిధ్యమైన నగరంగా వరంగల్‌ వెలుగొందుతున్నదని తెలంగాణ ప్రభుత్వం నూతన ఆలోచనలతో సాంకేతికతను జోడించి టీఎస్‌బీపాస్‌ తీసుకురావడంతో అత్యంత సులభంగా పర్మిషన్లు వస్తున్నారన్నారు. సామాన్య ప్రజలు ఇల్లు తీసుకునే ముందు ఆ ఏరియా డెవలప్‌మెంట్‌, ఫైనాన్స్‌ గురించి ఆలోచించి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రజలకు ప్రధాన ఆర్థిక స్థిరత్వం కోసం, హైదరాబాద్‌ తర్వాత అత్యంత అభివృద్ధి చెందుతున్న నగరంలో సామాన్యుల సొంతింటి కల నెరవేర్చేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో ఒక వేదిక ఏర్పాటు చేసిందని కొనియాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో ప్రజలు ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారన్నారు.

కొనుగోలుదారులకు సులభతరం చేసేందుకు బ్యాంకర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ప్రాపర్టీ షో చక్కని వేదికగా నిలిచిందని, అన్ని అనుమతులు పొందిన రియల్‌ రంగంలో, బ్యాంకర్లతో ఏర్పాటుచేయడం, వరంగల్‌ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని మేయర్‌ సుధారాణి అన్నారు. ఆర్థికంగా, వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో ప్రాపర్టీ షో ప్రజలకు అవగాహన వేదికగా నిలిచిందని డీఆర్డీవో శ్రీనివాస్‌ అన్నారు. కార్పొరేటర్‌ బోయినపల్లి రంజిత్‌రావు, టీజీవో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ అన్నమనేని జగన్మోహన్‌రావు సందర్శించారు. డీసీసీబీ ఏజీఎం రాజశేఖర్‌, నమస్తే తెలంగాణ బ్రాంచ్‌ మేనేజర్‌ పందిళ్ల అశోక్‌కుమార్‌, ఎడిషన్‌ ఇన్‌చార్జి కనపర్తి రమేశ్‌, బ్యూరో ఇన్‌చార్జి పిన్నింటి గోపాల్‌, అడ్వైర్టెజ్‌మెంట్‌ ఏజీఎంలు రాజిరెడ్డి, రాములు, అడ్వైర్టెజ్‌మెంట్‌ డిప్యూటీ మేనేజర్‌ అప్పని సూరయ్య, సర్క్యులేషన్‌ మేనేజర్‌ సురేశ్‌రెడ్డి, రిపోర్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

01

నేడు కూడా కొనసాగనున్న ప్రాపర్టీ షో

ప్రాపర్టీ షో శనివారం కూడా కొనసాగనున్నది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రజలకు వేదికగా నిలిచింది. పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వెంచర్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు, విల్లాలు, బ్యాంకు రుణాల గురించి తెలుసుకోవచ్చు. సొంతిల్లు, అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు కొనాలకునేందుకు ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడనున్నది.

సామాన్యుల సొంతింటి కల నెరవేరేలా..

సామాన్యుల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇలా ప్రాపర్టీ షో నిర్వహించడం అభినందనీయం. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బ్యాంకులు ఒకే వేదికపైకి రావడం ద్వారా ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ‘నమస్తే తెలంగాణ’ పాత్ర మరువలేనిది. ప్రజలకు ఉపయోగపడేలా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయం.

-మారెపల్లి సుధీర్‌కుమార్‌, హనుమకొండ జిల్లా జడ్పీ ఛైర్మన్‌

ఇది మంచి ప్లాట్‌ఫాం

‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మంచి ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. ఇల్లు కొనాలంటే బ్యాంకు సాయం, రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన అన్ని అంశాలను ప్రజలకు ఒక వేదిక ద్వారా అందుబాటులోకి తెచ్చారు. రియల్టర్లు ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలు కూడా జాగ్రత్తగా అన్నీ సరిచూసుకొని కొనుగోలు చేయాలి.

-అంబర్‌కిషోర్‌ ఝా, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌

గృహప్రవేశానికి సిద్ధంగా…

సెమీ ఫర్నిష్‌డ్‌, ఫాల్స్‌ సీలింగ్‌ విత్‌ లైట్స్‌, కప్‌బోర్డ్స్‌ సెల్ప్స్‌ సీలింగ్‌ వైరింగ్‌, ఫ్యాన్స్‌ ప్రొవిజన్‌తో గృహప్రవేశానికి సిద్ధంగా హనుమకొండ ప్రశాంత్‌నగర్‌ రోడ్‌-5లో ఉన్నాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రిటర్న్స్‌ వచ్చేలా సుష్మిత ట్రేడ్‌ సెంటర్‌లో కమర్షియల్‌ స్పేస్‌ కొని ఎక్కువ రాబడి పొందండి. కరీంనగర్‌ హైవేను ఆనుకొని డబుల్‌ సెల్లార్‌ సుమారు 100 కార్ల పార్కింగ్‌తో వివిధ బిజినెస్‌లకు అనుకూలంగా భీమారం రాధిక హాస్పిటల్‌ పక్కన అందుబాటులో ఉన్నాయి.

-ఎంఎస్‌ఎన్‌ మూర్తి, ఎస్‌ఎన్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ

అందుబాటు ధరల్లో ఫ్లాట్స్‌..

హంటర్‌రోడ్‌ నందీ హిల్స్‌కాలనీ రాజ్‌ హోటల్‌ వెనకాల లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌లో అందుబాటు ధరల్లో ఫ్లాట్స్‌ ఉన్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌ హైడ్రాలిక్‌ కార్‌ పార్కింగ్‌, సోలార్‌ పవర్‌ సిస్టమ్‌, గ్రీన్‌ ప్లాంటేషన్‌, సీసీ కెమెరాలు, 24 గంటలకు సెక్యూరిటీ, ఎక్సలెంట్‌ వెంటిలేషన్‌తో 3, 4బీహెచ్‌కే ఫ్లాట్స్‌ ఉన్నాయి. వివరాలకు 97051 22071 నంబర్‌లో సంప్రదించవచ్చు.

-నాగరాజు, నేచర్‌ స్ప్రింగ్స్‌ సైట్‌ ఇంజినీర్‌

డీసీసీబీ ద్వారా రుణాలు

ప్రాపర్టీ షో ద్వారా ప్రజలకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రజల్లో భద్రత, నమ్మకం కలిగించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. రైతులకు వ్యవసాయ భూముల కొనుగోలు, ఇల్లు కట్టుకునేందుకు సహకార బ్యాంకు రుణాలు ఇస్తున్నది. రియల్‌ ఎస్టేట్‌, వెంచర్స్‌, ఇండిపెండెంట్‌ హౌస్‌, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌, ఓపెన్‌ ప్లాట్స్‌ కొనుగోలుకు అర్హతలనుబట్టి రుణ సదుపాయం కల్పిస్తున్నది. గోల్డ్‌లోన్‌, వ్యవసాయ అనుబంధ, స్వయం సహాయక పొదుపు సంఘాలకు, వ్యక్తిగత, వాహన, విద్య, బిజినెస్‌, క్యాష్‌ క్రెడిట్‌, పీఎంఈజీపీ రుణాలు ఇస్తున్నది. సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌పై ఇతర వాణిజ్య బ్యాంకుల కంటే అత్యధిక వడ్డీ అందిస్తున్నది.

-మహ్మద్‌వజీర్‌ సుల్తాన్‌, డీసీసీబీ సీఈవో

సకల సౌకర్యాలతో ఫ్లాట్స్‌..

అందరికీ అందుబాటు ధరల్లో సకల సౌకర్యాలతో ఫ్లాట్స్‌ అందిస్తున్నాం. 2, 3బీహెచ్‌కే ఫ్లాట్స్‌ హనుమకొండ స్నేహనగర్‌, ఎస్వీ కన్వెన్షన్‌ హాల్‌ పక్కన అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్లబ్‌ హౌస్‌, వాకింగ్‌, స్విమ్మింగ్‌, సూపర్‌మార్కెట్‌, ఏసీ బంకెట్‌ హాల్‌, ఏసీ జిమ్‌, ఏసీ ఇండోర్‌గేమ్స్‌ హాల్‌, జాగింగ్‌ ట్రాక్‌, ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, కార్‌వాష్‌ ఏరియా, ఈవీ చార్జింగ్‌ పాయింట్స్‌, 1కేవీఏ జనరేటర్‌, ఓపెన్‌ ఎయిర్‌ స్క్రీన్‌.. ఇలా అన్ని సౌకర్యాలున్నాయి.

-కే ఉమాపతి, హరిహరపూర్ణోదయ బిల్డర్‌

హైదరాబాద్‌ హైవే దగ్గర్లో..

ఆలేరు, యాదగిరిగుట్ట వద్ద అందుబాటులో అపార్ట్‌మెంట్స్‌ అందిస్తున్నాం. గేటెడ్‌ కమ్యూనిటీ, వందశాతం వాస్తు, కంప్లీట్‌ కాంపౌండ్‌వాల్‌, సీసీటీ, సోలార్‌, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, 33, 40 ఫీట్ల రోడ్‌ హైదరాబాద్‌కు హైవేకు దగ్గరలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్‌ లోన్‌, ఈఎంఐ సౌకర్యం ఉంది. ఒకేసారి మొత్తం చెల్లిస్తే తక్కువ ధరకు అందిస్తున్నాం.

-పాశం రమణారెడ్డి, డైరెక్టర్‌, టీంలైన్‌ ఎకోసిటీ

రియల్‌ ఎస్టేట్‌కు ఆదరణ

ప్రాపర్టీ షో వేదికగా పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, బ్యాంకర్లు నెలకొల్పిన స్టాళ్లలో వెంచర్లు, ఇళ్లు, బ్యాంకు రుణాల వివరా లు తెలుసుకోవచ్చు. సొంతిల్లు, అపార్ట్‌మెంట్‌, ప్లాట్‌ కొనేందుకు ఈ షో చక్కని వేదిక. ఏవీ ఇన్‌ఫ్రాకాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులో అపార్ట్‌మెంట్స్‌ తీసుకొచ్చాం. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌లో రియల్‌ ఎస్టేట్‌కు మంచి ఆదరణ ఉంది. నగరం చుట్టూ జాతీయ రహదారులు, అనుసంధానంగా రింగ్‌ రోడ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోనూ ఓపెన్‌ ప్లాట్స్‌, ఫామ్‌ ల్యాండ్స్‌, అపార్ట్‌మెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి.

-గోగుల లక్ష్మీవిజయ్‌కుమార్‌, చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఏవీ ఇన్‌ఫ్రాకాన్‌

అందరికీ అందుబాటులో..

వరంగల్‌ నగరానికి అతిసమీపంలో తక్కువ ధరకు బిల్లా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్‌ ద్వారా ప్లాట్స్‌ అందిస్తున్నాం. దామెర ప్రతిమ హాస్పిటల్‌, ఓఆర్‌ఆర్‌ సమీపంలో అందుబాటు ధరల్లో విల్లాస్‌, ప్లాట్స్‌ ఉన్నాయి. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ద్వారా మంచి అవకాశం కల్పించారు. ‘కుడా’ నిబంధనల ప్రకారం గేటెడ్‌ కమ్యూనిటీ, సీసీ రోడ్లు, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌, 24 గంటల కరెంట్‌ సదుపాయం కల్పించాం. 10 నిమిషాల్లోనే నగరానికి చేరుకునేందుకు వీలుగా ఓఆర్‌ఆర్‌ అందుబాటులో ఉంది.

-బిల్లా రమణారెడ్డి, చైర్మన్‌, బిల్లా ఇన్‌ఫ్రా కన్‌స్ట్రక్షన్స్‌

ప్రజలకు అవగాహన వేదిక

కస్టమర్లకు అత్యంత సులభంగా సేవలందించేందుకు ఎస్‌బీఐ 48 బ్రాంచ్‌లు ఏర్పాటు చేసింది. తక్కువ వడ్డీరేటుతో ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజల ఆదరణతో ఇంకా సర్వీసులు పెంచాలనుకుంటున్నాం. వరంగల్‌ నగరంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో ప్రజలకు అవగాహన వేదికగా నిలిచింది. ఇంటి నిర్మాణం, బ్యాంకు రుణాల విషయంలో సరైన అవగాహన లేకపోవడం, స్థలాల రేట్లు పెరగడం, అధిక వడ్డీలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తక్కువ వడ్డీతో సులభంగా లోన్లు పొందేలా మేము అవగాహన కల్పిస్తున్నాం.

-వివేక్‌ జైస్వాల్‌, ఎస్‌బీఐ డీజీఎం

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.