తెలంగాణలో 9మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ సర్కార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ పీఎస్సీ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్ ను బదిలీ చేసి ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్ ను నియమించింది. నికోలస్ గతంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడిగా ఉన్నారు. గురుకుల నియామక బోర్డు కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఆయనకు ఉంది. ఈ మధ్యే ఐఏఎస్ గా పదోన్నతులు పొంది వెయిటింగ్ లో ఉన్న సీతాలక్ష్మీ, ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగ్స్ కలిపించింది. ఐఎఫ్ఎస్ అధికారి వీఎస్ఎన్వీ ప్రసాద్ పౌరసరఫరాల సంచాలకునిగా నియమించారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో కలకలం..నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టు..!!
The post TSPSC కార్యదర్శిగా నవీన్ నికోలస్..అనితా రామచంద్రన్ బదిలీ..!! appeared first on tnewstelugu.com.
