మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తులపై అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం (బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతరలో భక్తులు పెద్దెత్తున బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. గతంలో ఈ బెల్లాన్ని అక్రమార్కులు కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించేవారని..అధికారులు అమ్మకాలపై నిఘా పెడుతుండేవారు.
అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా బెల్లం కొనుగోళ్లపైన్నే ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించడం గమనార్హం. బంగారం కొనుగోలు చేసే ప్రతి ఒకరి ఆధార్ కార్డు జిరాక్సుతోపాటు ఫోన్ నెంబర్ సేకరించి తమ అందించాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వచ్చిన ఈ నిబంధనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనను సడలించాలని వ్యాపారులు, భక్తులు అధికారులను కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: TSPSC కార్యదర్శిగా నవీన్ నికోలస్..అనితా రామచంద్రన్ బదిలీ..!!
The post మేడారం భక్తులపై ఆంక్షలు..బంగారం కొనుగోలుకు ఆధార్ తప్పనిసరి..!! appeared first on tnewstelugu.com.
