ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ గల నగరాల్లో భారత్ నుంచి బెంగళూరు ఆరవ స్థానంలో నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ సూచీ 2023 రిపోర్టులో ఇది వెల్లడైంది. గతేడాది ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీగల నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ నిలిచింది. ఇక్కడ పదికిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకు పైగా పడుతున్నట్లు టామ్ కామ్ ట్రాపిక్ సూచీ 2023 వెల్లడించింది. డబ్లిన్ (ఐర్లాండ్) టొరంటో ( కెనడా)లు రెండు మూడుస్థానాల్లో నిలిచాయి. టాప్ 10 జాబితాలో భారత్ లోని బెంగుళూరు, పుణె నగరాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత.!
కాగా 55 దేశాల్లోని 387 నగరాల్లో 60కోటలకుపైగా ఇన్ కార్ నావిగేషన్ సిస్టమ్స్ ,స్మార్ట్ ఫోన్స్ సమాచారం ఆధారంగా ఈ రిపోర్టును రూపొందించినట్లు సంస్థ తెలిపింది. గతేడాది బెంగళూరులో పది కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 28.10 నిమిషాలు పట్టినట్లు రిపోర్టులో తేలింది. రద్దీ కారణంగా ఇక్కడ వాహనాలు ఏడాదిలో 132గంటలు కోల్పోయారు సగటు వేగం గంటకు 18కిలోమీటర్లు మాత్రమే ఉంది. పుణెలో 10 కిలోమీటర్లకు 27.50 నిమిషాల సమయం పట్టింది. స్థానికంగా వాహనాల సగట స్పీడ్ గంటలకు 19కిలోమీటర్లు ఉంది. మొత్తం జాబితాలో ఢిల్లీ, ముంబై 44,54 స్థానాల్లో నిలిచాయి.
