CM Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల కన్నెర్రజేశారు.
యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల కన్నెర్రజేశారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉండి గల్లీ లీడర్‌గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం భువనగిరి(Bhuvanagiri) పట్టణంలో ప్రిన్స్ కార్నర్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ(Effigy) దహనం చేశారు. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.
పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్, కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా రాష్ట్రంగా నిలిస్తే కాంగ్రెస్ పాలనలో రెండు నెలులు గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
