ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే వార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం..606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ షురూ అయ్యింది. అధికారిక వెబ్ సైట్ యూనియన్ unionbankofindia.co.inద్వారా ఈ పోస్టుల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీ లోపు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రుసుమగా రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 175 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆన్ లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్ స్క్రీనింగ్ లేదంటే అర్హత ఉన్న అభ్యర్థుల ఆధారంగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.
ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?
ముందుగా యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.inకు వెళ్లి అక్కడ హోం పేజీలో రిక్రూట్ మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. యూనియన్ బ్యాంక్ రిక్రూట్ మెంట్ ప్రాజెక్ట్ 2024-25 అని ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫామ్ ను పూరించి..అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించాలి. మరింత సమాచారం కోసం యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీలో ఈ నగరం టాప్..!!
The post నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు appeared first on tnewstelugu.com.
