బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్..నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మొదటిసారిగా పార్టీకార్యాలయానికి కేసీఆర్ వస్తున్నారు. దీని కోసం బీఆర్ఎస్ నేతలు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స తర్వాత దాదాపు రెండు నెలలుగా పార్టీ వ్యవహారాలకుదూరంగా ఉన్న కేసీఆర్ ఈమధ్యే రంగంలోకి దిగారు.
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలిసి అసెంబ్లీలో స్పీకర్ ముందు ప్రమాణం చేశారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. కృష్ణా నది జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుకలతో కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో సమావేశం అవుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేంద్రానికి అప్పగించడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ త్వరలోనే నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సభ గురించి కూడా కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చించే అవకాశం ఉంది.
రైతు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు తిప్పలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కృష్ణా నది వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేసీఆర్ రంగంలోకి దిగారంటే కాంగ్రెస్ కు ముచ్చెమటలు ఖాయమంటున్నారు. కాస్కో రేవంత్..కేసీఆర్ వస్తున్నారంటూ …జనాలు సైతం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్నారు.
ఇది కూడా చదవండి: గృహజ్యోతి..ఎవరికి ఉచితమో తెలియక గందరగోళం..!!
