రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం సర్యార్ చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఫ్రీగా ఇచ్చేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్దిదారులను గుర్తించే పనిని చేపట్టనుంది విద్యుత్ శాఖ . ప్రతినెలా మొదటివారం నుంచి పదిరోజులపాటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్దిదారులను గుర్తించాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఇంటింటికి వచ్చి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లతోపాటు మొబైల్ నెంబర్ కూడా తీసుకుని రీడింగ్ కోసం తీసుకువచ్చిన హ్యాండ్ హెల్త్ మిషన్ లో నమోదు చేస్తారు. మంగళవారం ఉదయం 9గంటలకల్లా దాని సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి క్షేత్ర స్థాయిలో రీడింగ్ కోసం వెళ్లనున్నారు.
అయితే గృహజ్యోతి జ్యోతిపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. సర్కార్ కచ్చితమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ప్రజల్లో ఎన్నో అపోహలు ఏర్పడుతున్నాయి. రేషన్ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి అని అధికార వర్గాలు అంటున్నాయి. అయితే హైదరాబాద్ లో ఉంటూ చాలా మందికి సొంత ఊర్లలో రేషన్ కార్డులు ఉన్నాయి. వారికి ఫ్రీ కరెంట్ ఎక్కడ ఇస్తారన్నదానిపై సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా కొన్ని లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడంతో దరఖాస్తు చేసుకున్నారు. వాటి గురించి కూడా సర్కార్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు కొత్త కార్డులు ఇస్తారా? లేదా? ఇస్తే ఎఫ్పటిలోగా ఇస్తారు?. కార్డుల జారీకి కూడా ఏదైనా కార్యక్రమం చేపడతారా? ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు సరిపోతాయా? లేక ఇంకేమైనా ఇవ్వాల్సి ఉంటుందా ?ఈ విషయాలన్నింటిపై ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టత వస్తేనే ప్రజల్లో గందరగోళం పోతుంది.
ఇది కూడా చదవండి: యెమెన్ కొత్త ప్రధానిగా అహ్మద్ అవద్ బిన్ ముబారక్ నియామకం..!
