ఏపీ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించారు. దీంతో వారిని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జీ చేశారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. పోలీసులను దాటుకుని అసెంబ్లీ వరకు సర్పంచులు చొచ్చుకుపోయారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు.
ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆగ్రహం వ్యకం చేశారు సర్పంచులు. వెంటనే ఈ విధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని వారు కోరారు. దీంతో పోలీసులు సర్పంచులను అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకుంటూ బయటకు తోసేశారు.
ఇది కూడా చదవండి: ఎల్ఐసీ నుంచి అదిరే ప్లాన్..డబుల్ బెనిఫిట్స్.. నేటి నుంచే షురూ!
