తెలంగాణను పోరాడి తెచ్చుకున్నదే సాగు నీళ్ల కోసమన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రయోజనాలను వెండి పల్లెంలో కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టన్నారు. జనవరి 17న జరిగిన కేంద్ర ప్రభుత్వ సమావేశంలో ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి అంగీకరించడంలో కాంగ్రెస్ తీవ్ర తప్పిదం చేసిందన్నారు నిరంజన్ రెడ్డి. ఈ విషయాన్ని తెలంగాణ గడప గడపకూ తీసుకెళ్తామన్నారు.
కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు కేంద్రానికి అప్పజెప్పడం తెలంగాణ జీవన్మరణ సమస్యకు దారితీస్తుందన్నారు నిరంజన్ రెడ్డి. శాశ్వతంగా నీటి హక్కులను తేల్చిచెప్పాలన్నారు. ఆరు నెలలలో తెలంగాణ నీటి వాటాను తేల్చిచెప్పాలి.. అంత వరకూ విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేఆర్ఎంబీ సమావేశం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత మూలంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయిందని విమర్శించారు. కనీసం ఇంత పెద్ద నిర్ణయం విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్షానికి చెప్పలేదన్నారు.
ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలి..తెలంగాణ హక్కు తేలే వరకు ఉద్యమాన్ని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది సాగునీరు, కరెంటు లేక .. బతుకుదెరువు లేని పరిస్థితుల నుండి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు..10 ఏండ్లలో కేసీఆర్ అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ది చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే అనాలోచితంగా తెలంగాణ శాశ్వత ప్రయోజనాలకు దెబ్బకొట్టిందని విమర్శించారు.కేంద్రానికి ప్రాజెక్టుల నిర్వహణ హక్కులు ఇవ్వడం అంటే ఆంధ్రా ప్రయోజనాలు నెరవేర్చడమేనని అన్నారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దాదాపు పూర్తయ్యిదని..కేవలం కాలువలు మాత్రమే మిగిలిపోయాయి .. దానికి సాగు నీళ్లు ఎలా తెస్తారు..అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. నీళ్ల హక్కులు కాపాడమంటే కేసీఆర్ నుని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 13న నల్లగొండ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు. నల్లగొండ సభకు ఆంక్షలు విధిస్తే కోర్టును ఆశ్రయిస్తాం .. ఆంక్షలతో సభను అడ్డుకోలేరన్నారు. మంత్రి ఉత్తమ్ రాజకీయ గురువు వైఎస్ నే ఎదుర్కొన్నాం మీరు లెక్క కాదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ఇది కూడా చదవండి: రాష్ట్ర సాగునీటి హక్కులను కాపాడునేందుకు ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ
