కోవిడ్ సమయంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేసే వెసులుబాటును కల్పించాయి. ఈ వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిన తర్వాత ఐటీ కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని తొలగిస్తున్నాయి. ఆఫీసులకు వచ్చి పని చేయాల్నిందేనని ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టేన్సీ సర్వీసెస్ కూడా వర్క్ ఫ్రం ఆఫీస్ రూల్స్ మరింత కఠినం చేసింది.
ఉద్యోగులను ఆఫీసుకు రప్పించేందుకు టీసీఎస్ చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. వర్క్ ఫ్రం హోం ఆఫీసు కోసం ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి నెలాఖరు వరకు ఆఫీసుకు రావాలని తాజాగా డెడ్ లైన్ నిర్దేశించింది. ఇదే చివరి అవకాశం అని పేర్కొంది. ఒకవేళ ఆఫీసుకు రాకుంట తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఉద్యోగులను హెచ్చరించింది టీసీఎస్ .
ఇది కూడా చదవండి: వన్ ప్లస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్..అమెజాన్‌లో బంపర్ సేల్..!!
వర్క్ ఫ్రం ఆఫీస్ గురించి కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రహ్మణ్యం ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ…చివరి డెడ్ లైన్ గురించి ఉద్యోగులకు తెలియజేసినట్లు చెప్పారు. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడం వెనక భద్రతా కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంటి నుంచే పనిచేయడం వల్ల ఉద్యోగులు, ఇటు సంస్థ కూడా ఇబ్బందులు ఎదురైతున్నాయని చెప్పారు. సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని..ఇంటి నుంచి పని చేసే విధానంలో వీటిని అడ్డుకునేందు ఛాన్స్ ఉండదని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ మధ్యే త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్, తమ అమెరికా యూనిట్ లో ఓ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఘటన గురించి తెలిపారు. డిసెంబర్ నెలలో తాము ర్యాన్సమ్ వేర్ దాడిని ఎదుర్కొన్నట్లు హెచ్సీఎల్ తెలిపింది. అయితే దాని వల్ల కంపెనీకి ఎలాంటి వాటిల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సైబర్ దాడులపై టీసీఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం 65శాతం మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు వస్తున్నారని సుబ్రహ్మణ్యం చెప్పారు. కోవిడ్ కు ముందు ఉన్న పని విధానాన్ని తీసుకురావాలని టీసీఎష్ ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: మాట్లాడుతుండగా కరెంట్ కట్… మార్పు వచ్చిందంటూ హరీశ్ రావు సెటైర్లు
The post ఆఫీసుకు రావాల్సిందే..లేదంటే చర్యలు తప్పవు..ఉద్యోగులకు టీసీఎస్ అల్టీమేటం! appeared first on tnewstelugu.com.
