యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మొదటి BAPS హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని BAPS హిందూ మందిర్ అధికారిక పత్రికా ప్రకటన తెలిపింది. BAPS ఆధ్యాత్మిక నాయకుడు స్వామి మహంత్ స్వామి మహారాజ్, అబు మురీఖా జిల్లాలో 27 ఎకరాల స్థలంలో ఆలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు యూఏఈ చేరుకున్నారు. అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయం అంత పెద్దది మరోకటి లేదు. ఈ బీఏపీఎస్ ఆలయాన్ని ఈనెల 14వ తేదీన భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారు.
అరబ్ దేశాల్లోనే పెద్ద ఆలయం:
అరబ్ దేశాల్లో ఈ దేవాలయం అంత పెద్ద ఆలయం మరోకటి లేదు. అంతేకాదు మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందింది. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి ఆద్వర్యంలో ప్రాణ ప్రతిష్ట జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులో కి వస్తుంది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్ సైట్ కు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది.
హస్ ఎక్సలెన్సీ హిస్ హోలీనెస్‌తో ఇలా అన్నారు, ‘యుఎఇకి స్వాగతం. మా దేశం మీ ఉనికితో ఆశీర్వదించబడింది. మీ దయతో మేము హత్తుకున్నాము మరియు మేము మీ ప్రార్థనలను అనుభవిస్తున్నాము.’ దానికి ప్రతిస్పందనగా, మహంత్ స్వామి మహారాజ్, ‘మీ ప్రేమ,గౌరవానికి మేము హత్తుకున్నాము. UAE నాయకులు గొప్పవారు, మంచివారు మరియు విశాల హృదయులు’ అని ఆప్యాయంగా బదులిచ్చారు. వార్తా సంస్థ ANI కోట్ చేసిన విధంగా ప్రకటన పేర్కొంది.
భారత్ నుంచి దేవాలయానికి మెటీరియల్ సరఫరా:
బీఏపీఎస్ హిందూ దేవాలయం పింక్ రాజస్థాన్ ఇసుకరాయి, తెలుపు ఇటాలియన్ మార్బుల్ రాయితో నిర్మించారు.ఇవన్నీ కూడా భారత్ లో చెక్కి యూఎఈకి సరఫరా చేసారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 2015లో ప్రధాని మోదీ దేశ పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం 13.5 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు.జనవరి 2019లో, UAE ప్రభుత్వం మరో 13.5 ఎకరాల భూమిని మంజూరు చేసింది. తద్వారా ఆలయం కోసం మొత్తం 27 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చింది.
ఆలయ నిర్మాణ వ్యయం 400 మిలియన్ దిర్హామ్:
2017లో ప్రధాని మోదీ ఆలయానికి శంకుస్థాపన చేశారు.ఆలయంలోని ఏడు గోపురాలు ఒక్కొక్కటి UAE ఎమిరేట్‌కి సంబంధించినవి.ఆలయ సముదాయంలో సందర్శకుల కేంద్రం, ప్రార్థనా మందిరాలు, నేపథ్య తోటలు, అభ్యాస ప్రాంతాలు మొదలైనవి ఉన్నాయి.ఆలయం దాని పునాదిలో 100 సెన్సార్లు , భూకంప కార్యకలాపాలు, ఉష్ణోగ్రత మార్పులు మొదలైనవాటిని తనిఖీ చేయడానికి ఇతర ప్రాంతాలలో మరిన్ని సెన్సార్లను ఏర్పాటు చేసింది.ఆలయ నిర్మాణ వ్యయం 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్‌గా అంచనా.
ఇది కూడా చదవండి: ఇదెక్కడి ట్విస్ట్.. రేషన్ కార్డు ఉన్నవారికే ఉచిత కరెంటు..!!
