ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ నోట చెప్పించారని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. గవర్నర్ ప్రసంగం అనేది విజన్ డాక్యుమెంట్ లాగా చూస్తాం.. కానీ పేలవంగా ఉందన్నారు. హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు నిరాశ మిగిల్చిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన హరీశ్ రావు..వృద్దులు, వికలాంగులకు, ఆసరా పింఛన్ దారులకు, మహిళలకు నిరాశ కల్గించింది. పంటకు బోనస్ గురించి మాట్లాడక పోవడం వల్ల రైతాంగానికి నిరాశ మిగిల్చింది. ప్రజలకు ఏలాంటి విశ్వాసం కల్పించలేదు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టో అంశాల గురించి ఎక్కడా చెప్పలేదు. నిరుద్యోగ భృతి గురించి చెప్పలేదు. ప్రజా వాణి తుస్సుమంది. సీఎం ప్రతి రోజూ వినతులు స్వీకరిస్తారు అన్నారు. మంత్రులు, ఐఎఎస్ లు లేరు. చివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తులు తీసుకుంటున్నారు.
ప్రజావాణి గురించి అర్థ సత్యాలు గవర్నర్ నోట చెప్పించారని అన్నారు హరీశ్ రావు. ఆరు గ్యారెంటీలో మొత్తం 13 ఉన్నాయి. రెండు అమలు చేసి మొత్తం చేసినట్లు చెబుతున్నారు. 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంచడం లోపంతో ఉంది. అందుకే గవర్నర్ ప్రసంగంలో లేదు. డిసెంబర్ 9 నాడు ప్రమాణం చేసి, 2 లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారు. ప్రమాణ స్వీకారం రెండు రోజులు ముందు చేసి… ప్రజల హామీ మాత్రం వాయిదా వేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు. వంద రోజుల్లో 60 రోజులు పూర్తి అయ్యాయి. మిగతా 40 రోజులే ఉన్నాయి. పార్లమెంట్ కోడ్ వస్తే హామీలు ఎలా అమలు చేస్తారు. చిత్తశుద్ది ఉంటే హామీల అమలు గురించి గవర్నర్ ప్రసంగంలో ఉండేది. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు. గవర్నర్ ప్రసంగం అంటే ఏడాదికి విజన్ డాక్యుమెంట్.
500 గ్యాస్, కరెంట్ 200 యూనిట్లు ఇస్తామన్నారు. ఇవి రెండు గురించి మాత్రమే చెప్పారు. అంటే మిగతా హామీలు వచ్చే ఏడాదిలో చేయలేము అని చెప్పకనే చెప్పారు. వంద రోజుల్లో అమలు చేయలేమని చేతులు ఎత్తేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల కాలంలో రైతులకు అన్యాయం చేశారు. 15 వేల రైతు బంధు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. వడ్లకు 500 బోనస్, 24 గంటల కరెంట్ అన్నారు. మాట తప్పారు. రైతులకు మోసం చేశారు. రాష్ట్రంలో రైతులు కరెంట్ కోతలు ఎదుర్కొంటున్నారు. వచ్చే యాసంగి పంటకు అయినా బోనస్ ఇస్తారని చెబుతారని ఎదురు చూశాం కానీ నిరాశ ఎదురైంది. 40 వేల కోట్ల పెట్టుబడిపై వైట్ పేపర్ విడుదల చేయాలి.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ఛాంబర్ మార్పు.. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్య
