తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో బాంబు బెదిరింపులు వచ్చాయి. పట్టణంలోని పలు స్కూళ్లకు కొందరు దుండగులు బాంబులు పెట్టామంటూ ఈ మెయిల్స్ సెండ్ చేశారు. ముఖ్యంగా జేజే నగర్, ఆర్ఏ పురం, అన్నానగర్, గోపాలపురంలోని పలు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
దీంతో అలర్టైన ఆయా స్కూళ్ల సిబ్బంది విద్యార్థులను వారివారి ఇళ్లకు పంపేశారు. ఆ తర్వాత బాంబు స్వ్కాడ్ కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠాశాలల యాజమాన్యాలు ఊపరి పీల్చుకున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లికి ఒప్పుకోలేదని రోడ్డుపై నరికి చంపాడు
