ఆయన ఐఎఫ్ఎస్ అధికారి. బాధ్యతాయుతంగా వ్యవహారించాల్సిన ఆ అధికారి..అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బాధ్యతలను గాలికొదిలేసి..వేలకోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించాడు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అతని నుంచి రూ. 4.5 కోట్ల నగదుతోపాటు..మరో రూ. 34కోట్ల విలువైన నగలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…అటవీ భూముల కుంభకోణం కేసులో ఉత్తరాఖండ్ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్ పేరు కూడా బయటకు వచ్చింది. కెనాల్ రోడ్డులోని ఆయన నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు చేసింది. అర్థరాత్రి వరకు అతని ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు రికవరీ చేశారు. సుశాంత్ పట్నాయక్ ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో రూ.4.5 కోట్ల నగదు, రూ.34 కోట్ల విలువైన చర, స్థిరాస్తుల పత్రాలు లభ్యమయ్యాయి.
#WATCH | Dehradun: ED raids the house of IFS officer Sushant Patnaik. ED has also ordered a note-counting machine. pic.twitter.com/A5nX16T75i
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 7, 2024
పట్నాయక్ ఇంట్లో గుట్టలు గుట్టలుగా నగదు బయటపడటంతో నోట్లను లెక్కించేందుకు అధికారులు నోట్లను లెక్కించే మిషన్ సాయం తీసుకున్నారు. నగదు లెక్కింపు పూర్తయ్యే సరికి ఆ మొత్తం రూ.4.5 కోట్లు తేలింది. అంతేకాకుండా, అతని ఇంటి నుండి నగదుతో కూడిన కొన్ని ఎన్వలప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంతమంది IFS అధికారులు, రేంజర్ల పేర్లు ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కాంగ్రెస్ నాయకుడు హరక్ సింగ్ ఇంటిపై కూడా ED బుధవారం దాడి చేసింది. దీంతో పాటు 16 చోట్ల ఏకకాలంలో ఈ చర్య చేపట్టారు.
కాగా ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ పట్నాయక్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఉత్తరాఖండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (యుపిసిబి) నేషనల్ ఎయిర్ క్లీన్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ (ఎన్‌సిఎపి) కింద పనిచేస్తున్న ఒక మహిళ బోర్డు సభ్య కార్యదర్శి,ఐఎఫ్‌ఎస్ అధికారిపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కేసులో రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ కార్యదర్శిపై కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: కాలిఫోర్నియాలో కూలిన ఆర్మీ హెలికాప్టర్..ఐదుగురు జవాన్లు మృతి..!!
