Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Fake Loan Apps | గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,200 నకిలీ రుణయాప్‌ల తొలిగింపు..!-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 8, 2024No Comments

Fake Loan Apps | గూగుల్ తన ప్లే స్టోర్ ఈ ఏడాదిలో 2200 నకిలీ రుణ యాప్‌లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

February 8, 2024 / 10:36 PM IST
Fake Loan Apps | గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,200 నకిలీ రుణయాప్‌ల తొలిగింపు..!

Fake Loan Apps | గూగుల్ తన ప్లే స్టోర్ ఈ ఏడాదిలో 2200 నకిలీ రుణ యాప్‌లను తొలగించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కేంద్ర మంత్రి పార్ల‌మెంట్‌లో స్వయంగా ఈ సంగ‌తి ప్రకటించారు. 2022 సెప్టెంబర్ నుంచి ఆగస్టు 2023 మధ్య లోన్ ఇస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న 2,200 కు పైగా లోన్ యాప్‌లను తొలగించిందని, వాటిని బ్లాక్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తోపాటు ఇతర నియంత్రణ సంస్థలతో కలిసి కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్ రాజ్యసభ ప్ర‌శ్నోత్త‌రాల్లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

ఏప్రిల్ 2021 నుండి జూలై 2022 వరకు గూగుల్ సుమారు 3,500 నుండి 4,000 లోన్ యాప్‌లను సమీక్షించిందని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ తెలిపింది. అందులో 2,500 కు పైగా లోన్ యాప్‌లను తన ప్లే స్టోర్ నుండి గూగుల్ తొలగించిందని మంత్రి భ‌గ‌వ‌త్ కే క‌రాద్ తెలిపారు. అదేవిధంగా, 2022 సెప్టెంబర్ – 2023 ఆగస్టు మధ్య, గూగుల్ ప్లే స్టోర్ నుండి 2,200 కు పైగా లోన్ యాప్‌లు తొల‌గించిందన్నారు.

లోన్ యాప్‌ల వల్ల జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకొని గూగుల్ తన పాలసీలో కూడా తగు మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం, గూగుల్ ప్లే స్టోర్, ఇక నుంచి నియంత్రిత సంస్థలు (రెగుల్యేటరీ అథారిటీ) ఆమోదించిన రుణ యాప్‌లను మాత్రమే అనుమతిస్తుంది. డిజిటల్ లెండింగ్ కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ ( డిజిటల్ రుణ వ్యవస్థను నియంత్రించేందుకు )ను మరింత బలోపేతం చేయడంతోపాటు కస్టమర్లను మోసాల నుంచి కాపాడేందుకు రక్షణ వ్యవస్థను పెంచే లక్ష్యంతో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రుణ సేవలను అందించే సంస్ధలకు ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా దేశంలో ఆన్‌లైన్ రుణాలు ఇచ్చే యాప్‌లపై నిఘాను పెంచాయి.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.