తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మీకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని కోమటిరెడ్డిని కేటీఆర్ అడగారు. మీలాగే మాపైనా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందంటూ రాజగోపాల్ సమాధానం చెప్పారు.
దీనికి కేటీఆర్ స్పందించారు. ఫ్యామిలీ పాలనా కాదన్నా..బాగా పనిచేసేవారికి కీర్తి ప్రతిష్టాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఎంపీగా మీ కూతురు పోటీ చేస్తుందా లేక కొడుకు పోటీ చేస్తున్నాడా అని కేటీఆర్ అడగారు. అన్నా ప్లీజ్ నన్ను కాంట్రవర్సిల్లోకి లాగొద్దంటూ రాజగోపాల్ రెడ్డి కోరారు.ఈ క్రమంలో ఒకరిపై ఒకరు సరదా మాట్లాడుకున్నారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా
కాగా త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో,కాంగ్రెస్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ మంత్రి వర్గంలో మరో 6కి ఛాన్స్ ఉండటంతో సీనియర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.
కోమటి రెడ్డి బ్రదర్స్…నల్లగొండ నుంచి గెలిచిన వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి రావాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబానికి ఒకే పదవి అనే రూల్ పెడితే మాత్రం..రాజగోపాల్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లినట్లే అవుతుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లూ వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: హైటెక్స్ లో జీఎస్ఐ ఎక్స్ పో 2024 ప్రదర్శన ప్రారంభం
