సభ్య సమాజం తలదించుకునే ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనం రేపింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం ఘటనకు సంబంధించి కొందరు ఓ దళిత మహిళను వివస్త్రగా మార్చి జనాంగాల్లో కారం కొట్టి చిత్రహింసలు పెట్టారు. గ్రామంలో నడిబజారులో అందరు చూస్తుండగానే చెట్టు కట్టేసీ తీవ్రంగా కొట్టారు. మూడురోజులు క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇది కూడా చదవండి: పుస్తక ప్రియులకు పండగే..నేటి నుంచే హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫెయిర్..!!
రామారెడ్డి మండలానికి వలస వచ్చి బతుకుతున్న జంటపై మొదట దాడి చేశారు. ఇక్కడి నుంచి మాచారెడ్డి మండలంలోని మరో గ్రామానికి బాధిత జంటను తీసుకెళ్లి అక్కడ చెట్టుకట్టేసి కొట్టారు. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న మరుసటి రోజు వారిని కొందరు ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో చెలరేగిన వివాదంతో ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దారుణంపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీకి చెందినవారేనని గ్రామస్థులు అంటున్నారు. అధికారపార్టీకి చెందినవారు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మరో చరిత్ర సృష్టించబోతోన్న ఇస్రో..!!
The post కామారెడ్డి జిల్లాలో దారుణం..దళిత మహిళను వివస్త్రను చేసి పాశవిక చర్య..!! appeared first on tnewstelugu.com.
