నేటి నుంచి పుస్తక ప్రియులకు పండగే. హైదరాబాద్ లోని తెలంగాణ కళాభారతిలో ఈనెల 9 నుంచి 19 వరకు 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ వెల్లడించారు. గురువారం పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. పుస్తక మహోత్సవాన్ని మంత్రి జూపల్లి క్రుష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు. 10 నుంచి 18వ తేదీ వరకు సాహిత్య , సాంస్క్రుతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: గురుకుల పీజీటీ ఫలితాలు వచ్చేశాయ్…రిజల్ట్స్ లింక్ ఇదే..!!
