రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల ఊసే లేదు. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త సర్కార్ రాగానే పింఛన్ సొమ్మును నెలకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు చెల్లిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ ఖాతాల్లో పెంచిన సొమ్ముతోనే డబ్బులు పడతాయనుకున్న లబ్ధిదారుల ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తోంది. మెజార్టీ జిల్లాలో ఇంతవరకు పాత పింఛన్ కే దిక్కులేదు. కొత్త పింఛన్ సొమ్ముపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆసరా పైసలు పడ్డాయే లేదోనని లబ్ధిదారులు బ్యాంకులు చట్టూ తిరిగి అలసిపోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దగ్గరకు వెళ్లి ఆరా తీస్తే ఇంకా రాలేదని సమాధానం చెప్పడంతో ఆవేదనకు లోనవుతున్నారు.
ఇది కూడా చదవండి: కామారెడ్డి జిల్లాలో దారుణం..దళిత మహిళను వివస్త్రను చేసి పాశవిక చర్య..!!
కొన్ని జిల్లాల్లో అదీగత ఆసరా పింఛన్ సొమ్మును పంపిణీ చేసిన సర్కార్ మెజార్టీ జిల్లాల్లో ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. కానీ కేసీఆఱ్ సర్కార్ మాత్రం దివ్యాంగులకు రూ. 4016 ఇతర లబ్ధిదారులకు రూ.2016 చొప్పున నెలనెలా ఇచ్చి ఆసరాగా నిలిచింది. పింఛన్లు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ నయమంటూ పలువురు లబ్ధిదారులు చెప్పుతున్నారు.
ఇది కూడా చదవండి: పుస్తక ప్రియులకు పండగే..నేటి నుంచే హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫెయిర్..!!
