కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్ దారులు, ఉద్యోగులు నానా తిప్పలు పడుతున్నారు. సమయానికి జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే రెండు నెలలుగా జీతాలు అందక ఆశావర్కర్లు అల్లాడుతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్ తో ముడిపెట్టి రెండునెలలుగా తిప్పించుకుంటోంది సర్కార్. కేసీఆర్ హయాంలో ప్రతినెల రెండో తేదీనే వేతనాలు అందుకునే ఆశావర్కర్లు ఇప్పుడు వేతనాల కోసం రోడ్డుపై పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28వేల మంది ఆశావర్కర్లు సేవలు అందిస్తున్నారు. కేంద్ర పథకంలో భాగంగా వీరు నియమితులైనప్పటికీ రాష్ట్ర సర్కానర్ అన్ని పనులకు వీరినే పురమాయిస్తోంది.
రెండు నెలలుగా జీతాల్లేవ్:
వీరికి నెలకు చెల్లించే జీతం రూ. 9700మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత అంటే డిసెంబర్, జనవరి వేతనాలు వీరికి ఇప్పటి వరకు అందలేదు. వేతనాలు ఇవ్వండి అంటూ సంబంధితశాఖ మంత్రికి కమిషనర్, కలెక్టర్లకు వినతి పత్రాలు కూడా అందించారు. అయినా కూడా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. మూడురోజుల క్రితం నగరంలోని 1800వంది ఆశావర్కర్లు హైదరాబాద్ డీహెచ్ఎంవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: కామారెడ్డి జిల్లాలో దారుణం..దళిత మహిళను వివస్త్రను చేసి పాశవిక చర్య..!!
పలుచోట్ల సంబంధిత పీహెచ్ సీ వైద్యులకు సమ్మె నోటీసులు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టినట్లు ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు జయలక్ష్మీ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించనట్లయితే తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: గురుకుల పీజీటీ ఫలితాలు వచ్చేశాయ్…రిజల్ట్స్ లింక్ ఇదే..!!
