తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీల గురించి ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్..మరో రెండు పథకాలను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది. ఈ పథకాల్లో గృహజ్యోతి పథకం ఒకటి. దీనిలో భాగంగా 200యూనిట్ల ఫ్రీ విద్యుత్ అందించనుంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ కు షాక్ తగిలింది. ప్రభుత్వానికి మీటర్ రీడర్లు ఝలక్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఓటీటీ ఎంట్రీకి మెగాస్టార్ చిరంజీవి రెడీ?
తమ సమస్యలను పరిష్కరించేంత వరకు వివరాలు నమోదు చేయమని తేల్చి చెప్పారు. తమకు నెలంతా పని కల్పించాలని కనీసం వేతనం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వివరాల నమోదు పనిని గుత్తుదార్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్రీ కరెంట్ అమలు కోసం వినియోగదారుల ఫోన్, ఆధార్ రేషన్ కార్డు నెంబర్లను సేకరించాలన్నారు.
ఇది కూడా చదవండి : ఐఫోన్ 15పై బంపర్ డిస్కౌంట్..త్వరపడండి..ఆఫర్ కొద్దిరోజులే..!!
The post ఉచిత కరెంట్.. రేవంత్ రెడ్డి సర్కార్‌కు షాక్..!! appeared first on tnewstelugu.com.
