ఉల్లి ధరలు రైతుల కళ్లలో నుంచి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలను రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మొన్నటివరకు మంచి ధర పలికిన ఉల్లి…ఇప్పుడుపూర్తిగా పతనమయ్యాయి. దీంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్, రేగోడు, జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉల్లిపంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఎకరా విస్తీర్ణంలో ఉల్లి పంటను సాగు చేసేందుకు 60 వేల నుంచి 70వేల వరకు ఖర్చు అవుతుంది. గతేడాది ఎకరాకు 100క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ధర కూడా అత్యధికంగా క్వింటాల్ కు 60వేల వరకు పలికింది.
ఇది కూడా చదవండి : అసెంబ్లీకి ఆటోల్లో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!!
అయితే ఈ సారి వాతావరణ మార్పులతో దిగుబడి 70 నుంచి 80 క్వింటాళ్లకు మించి లేదు. ధర కూడా భారీగా పతనం అవుతోంది. ప్రస్తుతం క్వింటాల్ కు 1200 నుంచి 1400 వరకు మాత్రమే ధర పలుకుతోంది. దాంతో ఉల్లి రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. తాను రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తే లక్ష ఖర్చు అయ్యిందని పంట చేతికొచ్చే సరికి 60 నుంచి 70 వరకు నష్టపోయినట్లు ఉల్లిరైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి : ఓటీటీ ఎంట్రీకి మెగాస్టార్ చిరంజీవి రెడీ?
