మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహరావు గారికి భారతరత్న వరించడం యావత్ తెలంగాణ గర్వించదగ్గ విషయమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి పీవీ అని అన్నారు. స్వరాష్ట్రంలో పీవీకి బీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత గౌరవాన్నిచ్చిందన్నారు. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించింది. ఏడాది పాటుగా పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించిందని తెలిపారు.
అంతేకాదు..పీవీకి భారతరత్న ఇవ్వాలని మొదటిసారిగా డిమాండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని తెలిపారు హరీశ్ రావు. అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పీవీని ” తెలంగాణ ముద్దు బిడ్డ” అని కొనియాడారు. తమ డిమాండ్ ను గౌరవించి భారతరత్న ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న
